టిఐఎఫ్ ఆర్ దేశానికే తలమానికం: ప్రధాని మన్మోహన్

Manmohan Singh
హైదరాబాద్‌: టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టిఐఎఫ్ ఆర్) దేశానికే తలమానికమని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చి ప్రాంతీయ కేంద్రానికి ప్రధాని మన్మోహన్ ‌సింగ్‌ మంగళవారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ద్రశంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు. శాస్త్ర, పరిశోధన రంగంలో టీఐఎఫ్‌ఆర్‌ దేశానికి తలమానికంగా నిలుస్తోందని అన్నారు. దేశంలో శాస్త్రవిద్య, కంప్యూటర్‌ రంగాల అభివృద్ధికి టీఐఎఫ్‌ఆర్‌ విశేషంగా కృషిచేస్తోందని కొనియాడారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో పురోగతి మన దేశాభివృద్ధికి సూచిక అని పేర్కొన్నారు.

ప్రపంచశ్రేణి కేంద్రంగా టీఐఎఫ్‌ ఆర్‌ క్యాంపస్‌ మారుతుందనడంలో సందేహం లేదని అన్నారు. బోధన, పరిశోధన రంగాల పరస్పర సహకారంతో మరింత అభివృద్ధి సాధించగలమని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. శాస్త్రాభివృద్ధిని పెంపొందించుకుంటే ప్రపంచశక్తిగా నిలబడవచ్చని అన్నారు. దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఇనిస్టిట్యూట్‌లను నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులకు టీఐఎఫ్‌ఆర్‌ ప్రతినిధులు జ్ఞాపికలు అందజేశారు. ప్రధానితోపాటు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి రోశయ్య, కేంద్రమంత్రి వీరప్పమొయిలీ, టీఐఎఫ్‌ఆర్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ హైదరాబాదు నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+