మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై వైయస్ జగన్ ఫైర్

Anam Narayan Reddy
నెల్లూరు: మొదటిసారి తన ప్రత్యర్థుల పేరు పెట్టి కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విమర్శలు చేశారు. తన నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్రలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీరుపై ఫైర్ అయ్యారు. మీ మంత్రి ఏమయ్యాడని ప్రజలను అడిగారు. అనంతసాగరంలో ప్రజలు సమస్యలను తన దృష్టికి తెచ్చినప్పుడు మీ మంత్రి ఏం చేస్తున్నారు, రావడం లేదా అని అడిగారు. నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్రకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గత తొమ్మిది రోజులుగా జగన్ నెల్లూరులో ఓదార్పు యాత్ర చేస్తున్నారు. భుజం నొప్పి, మెడ నొప్పి కారణంగా ఆయన శనివారం ఓదార్పు యాత్రను రద్దు చేసుకున్నారు.

కాగా, వైయస్ జగన్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య నెల్లూరులో అగ్గి రాజుకుంటూనే ఉంది. ఆనం బ్రదర్స్ పై వైయస్ జగన్ వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల స్థాపనపై ఇటీవలి దాకా వివాదాలు కొనసాగుతూ వచ్చాయి. ఇప్పుడు ఫ్లెక్సీల విషయంలోనూ వివాదం నెలకొంది. నెల్లూరులో వైయస్ ఫ్లెక్సీని ధ్వంసం చేయడంపై వైయస్ జగన్ వర్గీయులు ఆనం బ్రదర్స్ పై మండిపడుతున్నారు. వైయస్ జగన్ కు లభిస్తున్న ఆదరణను ఓర్వలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రదీప్ కుమార్ రెడ్డి ఆనం బ్రదర్స్ పై మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+