టీడీపీ ఢిల్లీ యాత్ర ఉద్రిక్తం: సోనియా ఇంటికి వెళ్లే యత్నాన్ని అడ్డుకున్న పోలీసులు

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలతో, తెలంగాణ సెంటిమెంట్ తో అటలాడుకుంటున్నారని మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణపై ఈ శీతాకాలపు సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టి తీరాలని, తెలంగాణ ప్రక్రియను ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ కోసమే పుట్టిన తెరాస పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు లోక్ సభలో ఒక్కసారి కూడా తెలంగాణ విషయాన్ని లేవనెత్తలేదని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు విమర్శించారు. తెలంగాణలో పలు సమస్యలు ఉన్నప్పటికీ కేసిఆర్ మాట్లాడింది లేదన్నారు. మంత్రి పదవి ఇస్తే చూస్తూ కూర్చోవటం నేర్చుకున్నారన్నారు.ఐదేళ్లు ప్రణబ్ కమిటీతో కాలాయాపన చేసిన కాంగ్రెస్ ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ పేరుతో మరింత జాప్యం చేస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం విద్యార్థులు బలిదానాలు చేసుకుంటుంటే కాంగ్రెస్, తెరాస దోస్తీ కట్టి చూస్తున్నాయన్నారు.












Click it and Unblock the Notifications