చిరంజీవికి దూరమే: వైయస్ జగన్ కొత్త మిత్రుడు వంగవీటి రాధ?

వైయస్ జగన్ ను ఆదర్శంగా తీసుకుంటానని చెప్పడం ద్వారా వంగవీటి రాధ తన అంతరంగాన్ని బయటపెట్టినట్లు భావిస్తున్నారు. ఆయన కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తో చేతులు కలిపే అవకాశాలున్నాయని అంటున్నారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు అందరి కన్నా ముందుగా వంగవీటి రాధాకృష్ణ అందులోకి వెళ్లడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. విజయవాడలో శాసనసభ్యుడు శ్రీనివాస రావుకు ప్రాధాన్యం ఇస్తూ తనకు చిరంజీవి ప్రాధాన్యం తగ్గించడాన్ని వంగవీటి రాధా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఏ మాత్రం ప్రజారాజ్యం పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications