హైదరాబాదుతోనే యుగాంతమంటూ సీమాంధ్ర మీడియావి కట్టుకథలా?

2012లో యుగాంతం జరుగుతుందని, ఆ యుగాంతం హైదరాబాదుతోనే ప్రారంభమవుతుందని వ్యాఖ్యానాలు జోడించాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే ఆ రాష్ట్రానికి హైదరాబాదు గుండె కాయవంటిదని తెలంగాణవాదులు వాదిస్తున్న తరుణంలో హైదరాబాదీలను ఆందోళనకు గురిచేయడానికి ఈ వార్తాకథనాలు ప్రసారం చేస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాదుపై సీమాంధ్ర మీడియావి కట్టుకథలంటూ రాజ్ న్యూస్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. హైదరాబాదు ప్రపంచంలోనే అత్యంత సురక్షిత ప్రాంతమని వ్యాఖ్యానించింది. హైదరాబాదుకు టోర్నడోలు, భూకంపాలు తాకవని చెప్పింది. వేళ ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాదును వరదలు తప్ప మరోటి ముంచెత్తిన దాఖలాలు ఇప్పటి వరకు లేవనే విషయం అందరికీ తెలిసిందే.












Click it and Unblock the Notifications