దండ వేయడానికి ఫొటో దగ్గర పోటీ: ఇరువర్గాల మధ్య తోపులాట
Districts
oi-Srinivas G
By Srinivas
అదిలాబాద్: దివంగత మాజీ ప్రధాని విగ్రహానికి పూలమాల వేసే విషయంలో అదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వివేక్, శాసనమండలి సభ్యుడు ప్రేంసాగర్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆదివారం ఆక్టోబర్ 31వ తేదిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 26వ వర్ధంతి కావటంతో అదిలాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె ఫోటోకు దండ వేయడానికి వివేక్, ప్రేంసాగర్ వర్గీయులు నిశ్సయించుకున్నారు. అయితే దండ మేం మొదట వేయాలంటే మేం మొదట వేయాలని ఆ వర్గాల మధ్య తొలుత వాదనలు చోటు చేసుకున్నాయి. అది కాస్త చిలికి చిలికి ఘర్షణకు దారితీసింది.దీంతో ఇరువర్గాలమధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి.