వేడుకలు వద్దంటూ మినిస్టర్స్ క్వార్టర్స్ ను ముట్టడించిన ఓయు ఐకాస
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: సోమవారం నవంబర్ 1వ తేదిన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలంగాణలో రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్ లోని మంత్రుల నివాస స్థలాన్ని(మినిస్టర్స్ క్వార్టర్సు) ఉస్మానియా యూనివర్శిటీ ఐక్య కార్యాచరణ సమితి విద్యార్థులు ముట్టడించడానికి ప్రయత్నించారు. వెంటనే రాష్ట్ర వేడుకలను రద్దు చేయాలన్నారు. తెలంగాణ మంత్రులు ఉత్సవాలలో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్ర వేడుకలను మనం ఎలా జరుపుకుంటామని ప్రశ్నించారు. మంత్రులను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మంత్రుల క్వార్టర్సు వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసలు వచ్చి వారని సముదాయించే ప్రయత్నం చేశారు. ముట్టడికి యత్నించిన 20మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.