బలవంతంగా వ్యభిచారం చేయిస్తుందంటూ పోలీసులనాశ్రయించిన భర్త
Districts
oi-Srinivas G
By Srinivas
కడప: కడప జిల్లాలో తన భార్యను బలవంతంగా వ్యభిచారం చేయిస్తోందంటూ ఓ భర్త పోలీసులను ఆశ్రయించిన సంఘటన చోటు చేసుకుంది. తన భార్య జ్యోతిని పుత్తా కీర్తిరెడ్డి అనే మహిళ కిడ్నాప్ చేసిందని, తన భార్యచే బలవంతంగా వ్యభిచారం చేయిస్తోందని జ్యోతి మహిళ భర్త పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యను విడిచి పెట్టడానికి కీర్తిరెడ్డి తన వద్ద డబ్బులను డిమాండ్ చేస్తుందని ఆయన ఆరోపించారు. అయితే అయన పోలీసులకు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేదు. పోలీసులనుండి ఆయనకు హామీ ఎలాంటి హామీ లభింటలేదు. వారు ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదు.