నర్సులను రెగ్యులరైజ్ చేయకుంటే 4 జిల్లాల్లో బంద్: ఈటెల

తెలంగాణ ఆడపడుచులైన 24 గంటలుగా ట్యాంకుపైనే ఉన్నప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ఆయన ధ్వజమెత్తారు. నర్సులు ప్రత్యేకంగా ఏమీ కోరడం లేదని ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే వారు డిమాండు చేస్తున్నారని అన్నారు. ఒకే రాష్ట్రంలో నర్సులకు తెలంగాణకు ఓ న్యాయం, సీమాంధ్రులకు ఓ న్యాయం చేస్తున్న రోశయ్య ప్రభుత్వం ద్వంద నీతి అర్థమవుతుందని అన్నారు. జిల్లానుండి మంత్రులు ఉన్నప్పటికీ వారు తెలంగాణ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. వారు పదవులు కాపాడుకోవడానికే ప్రాకులాడుతున్నారని విమర్సించారు. నర్సుల డిమాండ్లు నెరవేర్చకపోతే తెరాస చూస్తూ ఊరుకోదన్నారు.












Click it and Unblock the Notifications