టెలికాం స్కామ్ పై అట్టుడికిన పార్లమెంటు, వాయిదా

సోమవారం లోక్ సభ ప్రారంభంకాగానే 2జీ స్పెక్ట్రమ్ అవినీతిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరిపించాలని బీజేపీ పట్టుపట్టి, సభలో నిరసనలు తెలిపింది. దీంతో స్పీకర్ ఎంత సర్ది చెప్పినప్పటికీ సభ్యులు వినకుండా నిరసన తెలుపుతూ పోడియం వద్దకు దూసుకుపోయారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొనంగా వాయిదా పడింది. వాయిదా పడిన అనంతరం తిరిగి ఉభయ సభలు ప్రారంభంకాగానే పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. సభా కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ ఎంత విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు వినక జేపీసీకి డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. దీంతో ఉభయ సభలూ మంగళవారంనాటికి వాయిదా పడ్డాయి.












Click it and Unblock the Notifications