వైయస్ జగన్ పై ఏఐసిసి సీరియస్: నివేదిక ఇవ్వాలని పిసిసికి ఆదేశం

YS Jagan
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి మీడియాలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి వ్యతిరేకంగా వార్తలు రావడాన్ని ఏఐసిసి తీవ్రంగా పరిగణించింది. అయితే తమకు ఇంత వరకు ఆ కథనాలపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఏఐసిసి వర్గాలు తెలిపాయి. నివేదిక అందిన తర్వాతే స్పందిస్తామంటున్నారు.

సమగ్ర నివేదిక అందించాల్సిందిగా పిసిసిని ఏఐసిసి కోరింది. నివేదిక అందిన తర్వాతనే షోకాజ్ నోటీసుపై నిర్ణయముంటుందని అవకాశం. పిసిసి చీఫ్ డి శ్రీనివాస్ వెంటనే అధిష్టానానికి నివేదిక పంపినట్లు సమాచారం. కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై వచ్చిన ఆరోపణలు వాస్తవ విరుద్ధమని రాష్ట్ర హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకువ్చిచిన ఘనత సోనియాగాంధీదేనని అన్నారు. కాగా జగన్ కు షోకాజ్ నోటీసు ఇచ్చే అవకాశం లేదని గోనె ప్రకాశరావు ఓ టీవీ ఇంటర్వ్యూలో అన్నారు. ఆయన క్షమాపణలు కోరే అవకాశముందన్నారు. కానీ సొంత పార్టీ పెట్టే అవకాశం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+