గొడవలు సృష్టిస్తే వెంటనే జగన్ వర్గంపై వేటుకు సిద్ధం?

కాగా హైదరాబాద్ వస్తున్న ప్రణబ్ ముఖర్జీ బృందానిని నిరసన తెలిపేందుకు జగన్ వర్గం సిద్ధమయింది. వారు జగన్ ను ముఖ్యమంత్రి చేయాలంటూ డిమాండ్ చేయాలనే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ అనుకూలురు అక్కడ ఫ్లకార్డులతో నిరసనలు తెలపడానికి నిలబడి ఉన్నారు. కాగా సిఎల్పీ భేటీలో ఎవరు కూడా ఎలాంటి గొడవ సృష్టించకుండానే క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎకె ఆంటోనీ వచ్చినట్టు సమాచారం.
పార్టీ సమావేసంలో ఎవరైన గొడవను సృష్టించాలని చూస్తే ఆంటోని అక్కడికక్కడే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశముంది. ప్రత్యేకంగా ఆయన అందుకే వస్తున్నట్లు సమాచారం. కాగా శాసనసభ్యుల్లో ఎక్కువమంది జగన్ కే మద్దతు పలుకుతారని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి అంటున్నారు.అవసరమైతే ఢిల్లీ కూడా వెళ్తామని ఆయన అన్నారు. సిఎల్పీ సమావేశానికి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications