సోనియాతో ముఖ్యమంత్రి రోశయ్య రహస్య భేటీలో చిరంజీవి?

ప్రజారాజ్యం పార్టీ నేత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్, రోశయ్య మంగళవారం ఒకే విమానంలో ఢిల్లీ వెళ్లడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుందని అంటున్నారు. విమానంలోనే వారిద్దరి మధ్య చర్చలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రధానితో చిరంజీవి సమావేశం ఎప్పుడో ఖరారైందని, రోశయ్య ఢిల్లీ పర్యటనతో సంబంధం లేదని అల్లు అరవింద్ చెప్పారు. తామిద్దరం ఒకే విమానంలో ఢిల్లీ రావడం యాదృచ్ఛికమేనని ఆయన అన్నారు. అయితే, అవసరమైతే రోశయ్య ప్రభుత్వాన్ని కాపాడడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం కూడా చిరంజీవి ఢిల్లీ పర్యటనలో భాగమని అంటున్నారు. చిరంజీవి బుధవారం కూడా ఢిల్లీలోనే ఉన్నారు. చిరంజీవి బుధవారం సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తో సమావేశమయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications