అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలకు చిరు ఆదేశం

కాగా మంగళవారం ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అదే రోజు చిరంజీవి కూడా ఢిల్లీ వెళ్లారు. అక్కడ రహస్యంగా రోశయ్య, చిరంజీవి 10 జనపథ్ లో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. ఆ తర్వాత రోశయ్య వచ్చి సీఎల్పీ సమావేశం బుధవారం ఉంటుందని చెప్పడం జరిగింది. డిల్లీలోనే బుధవారం వరకు ఉన్న చిరంజీవి అక్కడ పలువురు కాంగ్రెసు నేతలతో మంత్రివర్గంలో చేరే విషయంపై చర్చించినట్లు సమాచారం. జగన్ స్థానంలో ఆయనకు చెక్ చెప్పేందుకు అధిష్టానం చిరంజీవి తెరపైకి తీసుకు వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
కాగా ముఖ్యమంత్రి రోశయ్యను మార్చే విషయమై వార్తలు గుప్పుమంటున్నాయి. రోశయ్య స్థానంలో శాసనసబాపతి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, గీతారెడ్డిలు క్యూలో ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి మార్పేమి ఉండదని మాత్రం కాంగ్రెసు నేతలు అంటున్నారు. సాయంత్రం సిఎల్పీ సమావేశం అనంతరం ప్రజారాజ్యాన్ని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి తీర్మానం చేసి చిరుకు డిప్యూటీ సిఎంతో పాటు ఆ పార్టీకి మరో మూడు మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications