కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోకి చిరంజీవి నో ఎంట్రీ

తాజా రాజకీయ పరిణామాలను తమ పార్టీ అధ్యయనం చేస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. తమ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు. పార్టీ వైఖరిపై కార్యకర్తలకు స్పష్టత ఇచ్చేందుకు నాయకులను సంసిద్ధం చేయనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 4,5,6 తేదీల్లో పార్టీ శిక్షణా శిబిరాలు జరుగుతాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications