వైయ్ససార్ ఆఖరి రాజకీయ కోరిక నెరవేరుస్తా: సిఎం కిరణ్ కుమార్ రెడ్డి

శ్రీకృష్ణ కమిటీని వేశారని, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏది ఆశిస్తే అది చేస్తామని ఆయన చెప్పారు. సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరిస్తామని, 12, 13 ఆందోళనలు సాగుతున్నాయని, మంత్రివర్గం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, ఆ వెంటనే సమస్యలు పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. అందరితో కలిసి పనిచేయడానికి తనకు ఏ విధమైన ఇబ్బంది లేదని ఆయన చెప్పారు. ప్రతిపక్షాల సహకారం తీసుకుని ముందుకు సాగుతానని, ఇది వరకే ప్రతిపక్షాల నాయకులను ఈ మేరకు కోరానని ఆయన చెప్పారు. పారిశ్రామికీకరణ, జలయజ్ఞం వంటివాటిని వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. మావోయిస్టు సమస్యపై ప్రస్తుత విధానమే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తన నివాసానికి సంబంధించిన వివాదమేమీ లేదని ఆయన చెప్పారు. భూమి తిరిగి ఇచ్చేసి, డబ్బులు తిరిగి ఇచ్చేశానని ఆయన చెప్పారు. పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా తేవడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు.
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన, మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య కొనసాగించిన అన్ని సంక్షేమ పథకాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తానని కొత్త ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. సంక్షేమ పథకాలు ఎవరికి అందాలో వారికి అందేలా లొసుగులను సవరించి అమలు చేస్తామని ఆయన చెప్పారు. పథకాల అమలును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పథకాలను పారదర్శకంగా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకు కొత్త పద్ధతులను ప్రవేశపెడతానని ఆయన చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. పెట్టుబడులకు సానుకూలమైన రాష్ట్రంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. అందరినీ కలుపుకుని పోతానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications