రంగారెడ్డి జిల్లాలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సిఎం కిరణ్

కాగా ముఖ్యమంత్రి తాండూరు పర్యటన కొంత ఉద్రిక్తంగా మారింది. కిరణ్ ను పర్యటనను అడ్డుకునేందుకు ఉస్మానియా ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు తెరాస కార్యకర్తలు, విద్యార్థులు ముఖ్యమంత్రి కాన్వాయ్ కు అడ్డుగా వచ్చి తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ పర్యటన సందర్భంగా పోలీసులు ముందుగానే భారీగా పోలీసులు మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా సిఎం రాకముందే కొందరు తెరాస నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నానికి సచివాలయానికి వస్తారు.












Click it and Unblock the Notifications