తెలంగాణ కోసం జర్నలిస్టులు ఏకం కావటం హర్షణీయం: కెసిఆర్

ప్రభుత్వం ఇప్పటికే రబ్బరు బుల్లెట్లతో ఉద్యామాన్ని అణిచి వేయడానికి ప్రయత్నాలు చేస్తుందన్నారు. అయితే రబ్బరు బుల్లెట్లకు, అత్యాధునిక ఆయుధాలకు తెలంగాణ ప్రజలు ఎప్పుడూ భయపడరన్నారు. ఉద్యమాలు తెలంగాణకు కొత్తకాదన్నారు. అన్ని పార్టీల నాయకులు తెలంగాణ సాధన కోసం బయటకు రావాలన్నారు. వారి వారి పార్టీలలోనే ఉంటూ నాటకాలాడుతున్నారన్నారు. వారి నాటకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజల్లో వారిపై తిరుగుబాటు రాకముందే బయటకు రావాలని పిలుపునిచ్చారు. డిజిపి ఆనందరావు ఇప్పుడే ఉద్యామాన్ని అణిచివేయడానికి భయపెట్టే ప్రకటనలు చేస్తున్నారని అయితే వాటికి ఎవరూ భయపడరన్నారు.
తెలంగాణ జర్నలిస్టులు ఆంధ్ర యాజమాన్య పత్రికాధిపతుల కింద పని చేస్తూ కూడా తెలంగాణ కోసం తమ వంతు కృషి చేస్తున్నారన్నారు. పెట్టుబడుల విషయంలో మాజీ ముఖ్యమంత్రి ఓ మాట చెబితే ఇప్పటి ముఖ్యమంత్రి మరో విధంగా చెబుతున్నారన్నారు. రోశయ్య పెట్టుబడులు వెనక్కి పోలేదని చెబితే, ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యమాల వల్ల 6వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి పోయాయని చెప్పారని విమర్శించారు.












Click it and Unblock the Notifications