వైయస్ జగన్ పై కిరణ్ కుమార్ రెడ్డి డైరెక్ట్ అటాక్

Kiran kumar Reddy
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్న వైయస్ జగన్ పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డైరెక్ట్ అటాక్ కు దిగారు. వైయస్ జగన్ ఓపిక పట్టాల్సి ఉండిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. పార్టీలో ఉన్నత పదవులను అధిష్టించాలంటే ఓర్పు తప్పనిసరి అని ఆయన అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. రెండు దశాబ్దాల తర్వాత తనకు ముఖ్యమంత్రి పదవి లభించిందని ఆయన చెప్పారు. ఓపిక పట్టి ఉంటే వైయస్ జగన్ కు తప్పకుండా గుర్తింపు లభించి ఉండేదని ఆయన అన్నారు.

దివంగత నేత వైఎస్సార్ పాదయాత్ర చేసిన సమయంలో ఆయనకు వచ్చిన ఆదరణను చూసి కొందరు సొంతగా పార్టీ పెట్టాలని సూచించారన్నారు. అయితే ఆయన దానిని ఖండించి తను పార్టీకే అంకితమవుతానని చెప్పాడని గుర్తు చేసుకున్నారు. పార్టీని వదిలిపోవాలని వైఎస్సార్‌ లేశమాత్రంగా కూడా ఆలోచన రాలేదని తను చెప్పగలనన్నారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే వైఎస్సార్ కుమిలిపోయేవారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తులకన్నా పార్టీయే ముఖ్యమన్న సంగతిని ప్రతి కార్యకర్త గుర్తు పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడిని నిశితంగా గమనిస్తుందనీ, అందుకు ఉదాహరణే తనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడమని వెల్లడించారు. ఓర్పు, సహనంతో మన పని మనం చేసుకుంటే పోతే ఏదో ఒకనాటికి లక్ష్యాన్ని చేరుకోగలమని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+