తాజ్ మహల్ సందర్శించిన ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ
National
oi-Srinivas G
By Srinivas
ఆగ్రా: ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్‌ను ఆదివారం సందర్శించారు. సర్కోజీ తన సతీమణి కార్లా బ్రూనీతో కలిసి తాజ్ మహల్ ను సందర్శించారు. సుమారు గంట పాటు సర్కోజీ దంపతులు తాజ్ మహల్ లో గడిపారు. తాజ్ మహల్ అందానికి సర్కోజీ దంపతులు మంత్రముగ్దులయ్యారు. తాజ్ వద్ద కొన్ని ఫోటోలు దిగారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం సర్కోజీ దంపతులు ఆగ్రాలో పర్యటించ వలసి వున్నది. అయితే శనివారం సాయంత్రమే వీరు ఆగ్రా చేరుకున్నారు. ఆగ్రాలోని అమరావతి విలాస్ హోటల్లో బస చేశారు. తాజ్ మహల్ కట్టడాన్ని వీక్షించిన తర్వాత తాజ్ కు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నఫతేపూర్ సిక్రీని సైతం సందర్శించారు. దీనిని అక్పర్ నిర్మించారు.