వరంగల్లో 181 మంది నర్సులపై నాన్ బెయిలబుల్ వారెంట్

ఈ మేరకు ఆందోళన నిర్వహిస్తున్న స్టాఫ్ నర్సులపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆసుపత్రి పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే 181 మంది నర్సులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు తెలుస్తోంది. నర్సులు గత 34 గంటలుగా తమ దీక్షను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం గతంలో తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారు అంటున్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఎవరూ ఆపరన్నారు.నర్సులపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యాడు. నర్సులవి గొంతెమ్మ కోర్కెలని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications