మందకృష్ణను కలిసిన తలసాని, మంద జగన్నాథం, విమలక్క

Talasani Srinivas Yadav
హైదరాబాద్‌: మాదిగలకు ప్రత్యేక కోటా(రిజర్వేషన్) కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మందకృష్ణ మాదిగను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తెలసాని శ్రీనవాస్ యాదవ్ ఆదివారం పరామర్శించారు. ప్రజలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోందని తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. మాదిగలకు అన్యాయం జరుగుతోందని, మందకృష్ణ మాదిగకు ప్రభుత్వం దిగి రావాలన్నారు. ఆయన పోరాటానికి తలసాని సంఘీభావం తెలిపారు. పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం కూడా మందకృష్ణ మాదిగను కలిశారు. ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చిన తాను మందకృష్ణ అభిప్రాయం తెలుసుకున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మందకృష్ణ అభిప్రాయం చెప్పిన తర్వాత మరోమారు వచ్చి కలుస్తానన్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో వర్గీకరణ అంశం ఉన్నదని ఆయన గుర్తు చేశారు. తాము దానిని విస్మరించలేదని చెప్పారు. మందకృష్ణను అరుణోదయ విమలక్క కూడా కలిసి సంఘీభావం తెలిపారు. కాగా మందకృష్ణపై ఆబిడ్స్ పోలీసు స్టేషన్లో 153 తదితర సెక్షన్లతో కేసు నమోదు చేశారు. రాత్రి పదిగంటల తర్వాత బహిరంగ సభను నిర్వహించినందుకు కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+