సిఎంపై ఫిర్యాదుకు ఢిల్లీకి బయలుదేరిన వట్టి వసంత్ కుమార్?

వట్టి ఆదివారం సాయంత్రం సోనియా వ్యక్తిగత కార్యదర్శి అహ్మద్ పటేల్ ను కలవనున్నారు. అహ్మద్ పటేల్ తో కలిసి సోనియాతో అప్పాయింటుమెంటుకోసం అడుగుతారు. అప్పాయింటుమెంటు ఇస్తే రేపు సోనియాను కలిసే అవకాశాలు ఉన్నాయి. రేపు సోనియాతో భేటీ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీతోనూ భేటీ అవుతారు. మరోపక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కుతూహలమ్మ కూడా ఇవే అంశాలపై అధినేత్రిని కలిసేందుకు రేపు ఢిల్లీ పర్యటనకు బయలు దేరుతున్నారు. తాను ఇప్పటికీ ఐదుసార్లు గెలిచానని, తన వద్ద డబ్బు లేనందున, తాను దళితురాలిని అయినందునే తనకు మంత్రివర్గంలో కిరణ్ కుమార్ రెడ్డి చోటు కల్పించలేదని ఆమె ఆవేదన చెందారు.












Click it and Unblock the Notifications