భవిష్యత్తులో మంచి పదవి ఇస్తానని సోనియా చెప్పారు: జెసి

సోనియాను పలువులు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, నాయకులు సోమవారం కలుసుకున్నారు. గాదె వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క సభాపతి(స్పీకరు) పదవి కోసం సోనియాను కలిశారు. పార్లమెంటు సభ్యులు సురేష్ షేట్కార్, రాజయ్య, పనబాక లక్ష్మి, బలరాం నాయక్ లు కలిశారు. ప్రాంతాల వారిగా ఎస్సీ వర్గీకరణ చేస్తే అందరికి సమన్యాయం జరుగుతుందని కేంద్రమంత్రి పనబాక ఈ సందర్భంగా సోనియాకు తెలిపారు.
పిసిసి అధ్యక్ష పదవికి, శాసనసభా స్పీకర్ పదవికి, చీఫ్ విప్ పదవికి నియామకాలు జరగనున్న నేపథ్యంలో వరుసగా సోనియాను కలుస్తుండడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ముఖ్మయంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లి ఆ పదవులకు అభ్యర్థులను ఖరారు చేసుకుంటారని భావిస్తున్నారు. ఆయన ఢిల్లి వచ్చేలోగా సోనియా దృష్టిలో పడేందుకు వారు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications