కొండా సురేఖ వ్యాఖ్యలకు చంద్రబాబు సొంత డబ్బా సిగ్గుచేటు: బాలరాజు
State
oi-Srinivas G
By Srinivas
విశాఖపట్టణం: మాజీమంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ వర్గం కాంగ్రెస్ శాసనసభ్యురాలు కొండా సురేఖ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రారావుపై చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారంలోకి రావడానికి కెవిపి రామచంద్రారావు ఎంతో కృషి చేశారన్నారు. కొండా సురేఖ మాటలు అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి సొంత డబ్బా కొట్టుకోవటం సిగ్గు చేటన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండుగని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. రైతుల గురించి చంద్రబాబు స్పందిస్తానని అంటుంటే ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు.