కెవిపి రామచంద్రారావుమీద కొండా సురేఖ వ్యాఖ్యలపై మాట్లాడను: సిఎం

ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రారావు చేసిన రాజీనామాపై ఇంకా ఆలోచించలేదని ఆయన అన్నారు. మిగతా ప్రభుత్వ సలహాదారుల రాజీనామాలపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇతరత్రా ప్రధాన సమస్యలు ఉన్నందున వాటిపై సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటామని పూర్తిస్థాయిలో విశ్లేషణ చేయాల్సి ఉందని తెలిపారు. సలహాదారుల రాజీనామాలను ఆమోదించక పోవడానికి కారణాలేమిటన్నది విలేకరులకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.సలహాదారులను మళ్లీ నియమించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ అవన్నీ ఊహాజనితాలు అన్నారు. ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ పోస్టుల నియామకంలో జాప్యం వల్ల అన్నింటినీ అధిష్ఠానమే నడిపిస్తోందన్న అపవాదును ఆయన కొట్టి పడేశారు. సాధారణంగా జాతీయ పార్టీలో సంప్రదింపుల ద్వారానే నిర్ణయాలు తీసుకుంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని మళ్లీ చెబుతున్నా.
వరద బాధితులను ప్రభుత్వం సరిగా పట్టించుకోవడంలేదంటూ జగన్ చేస్తున్న విమర్శల గురించి ప్రస్తావించినప్పుడు ఇప్పుడు వచ్చినవి వరదలు కాదు వానలు మాత్రమే. ఎక్కువ మోతాదులో వానలుపడి నష్టం జరిగింది. నేను వ్యక్తిగతంగా మూడు జిల్లాలకు వెళ్లి చూసొచ్చాను. ప్రస్తుతం నష్టాలను అంచనా వేస్తున్నాం. రైతులకు పెద్ద దెబ్బతగిలింది. ఇప్పటికే 465 మండలాలను వరద ప్రాంతాలుగా ప్రకటించాం. రుణాలు రీషెడ్యూల్ చేయమని చెప్పాం. పశుగ్రాసం, ఎరువులపై ఇప్పటికంటే ఎక్కువగా రాయితీ ఇవ్వాలని నిర్ణయించాం. నష్టంపై పూర్తిస్థాయి అంచనాలు వచ్చిన తర్వాతే ఆర్థిక సాయం గురించి నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు.
అసెంబ్లీ జరుగుతున్నందున విద్యార్థులపై కేసుల ఎత్తివేత అంశంపై తాను చెప్పలేనని కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రభుత్వ నిర్ణయమేమిటో అసెంబ్లీలో చెబుతామని, హోంమంత్రి దానిపై ప్రకటన చేస్తారని తెలిపారు. స్పీకర్ లేకుండా డిప్యూటీ స్పీకర్‌తో సభ నిర్వహించడం కొత్తకాదన్నారు. సభను సజావుగా నడిపించలేకపోతున్నారన్న ప్రతిపక్ష ఆరోపణలను కొట్టిపారేశారు. సభను సజావుగా నడిపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంత ఉందో దానికంటే ఎక్కువ ప్రతిపక్షంపైనా ఉంది. ప్రభుత్వానికి తన అభిప్రాయాన్ని వినిపించేందుకు చాలా వేదికలున్నాయి. ప్రతిపక్షానికున్నది అసెంబ్లీ ఒక్కటే. వారి ప్రధాన వేదిక అదే. అసెంబ్లీని సక్రమంగా ఉపయోగించుకోకుంటే వారు నష్టపోతారు. ప్రజలు నష్టపోతారు అని అన్నారు.












Click it and Unblock the Notifications