యూ టర్న్ తీసుకున్న పేర్ని నాని: కాంగ్రెసు లోనే కొనసాగుతానని స్పష్టం

2014 వరకు కాంగ్రెసు శాసనసభ్యునిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఒక శాసనసభ్యునిగా నియోజకవర్గానికి ఎవరు వచ్చినా కలుస్తానని చెప్పారు. చంద్రబాబునాయుడు వచ్చినా తనను కలుస్తానన్నారు. జేపి వచ్చినప్పుడు కూడా కలిశానన్నారు. తనకు ముఖ్యమంత్రి ఎలాంటి ఆశ చూపలేదన్నారు. నిన్న చెప్పిన విషయాన్నే ఈరోజు కూడా ముఖ్యమంత్రికి చెప్పానన్నారు. 21న తలపెట్టిన జగన్ నిరాహార దీక్షలో పాల్గొనని చెప్పారు. ముఖ్యమంత్రి కలవమంటే కలిశానన్నారు. పార్టీని వీడతానని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు.
కాగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శాసనసభ్యుడితో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. అయితే తాను జగన్ పర్యటనలో పాల్గొంటానని సిఎంకు స్పష్టం చేశారు. కార్యకర్తలనుండి తనకు తీవ్ర ఒత్తిడి వస్తుందని ఆయన చెప్పారు. కార్యకర్తల ఒత్తిడి వల్లనే తాను జగన్ పర్యటనలో పాల్గొంటున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications