జగన్ పార్టీలో చేరను! కాంగ్రెసు ను వీడను:రాయపాటి సాంబశివరావు

జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తాను పెళ్లి కార్డులు మాత్రమే ఇవ్వడానికి వెళ్లానని చెప్పారు.నేనెప్పుడూ పదవులు ఆశించలేదన్నారు. కాంగ్రెసు వల్లే నాకు గుర్తింపు వచ్చిందన్నారు. అయితే పార్టీలో మన రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు మంత్రి పదవులు లేక పోవటం వల్ల ప్రజలకు సరైన న్యాయం చేయలేక పోతున్నారన్నారు. నేను కూడా ప్రజలకు తగిన న్యాయం చేయలేకనే రాజకీయాల్లోనుండి తప్పుకుంటానని ప్రకటించినట్టు చెప్పారు.
జైపాల్ రెడ్డి మినహా ఎవరికీ మంత్రి పదవులు లేవన్నారు. ఇతర రాష్ట్రాలలో ఆయా పార్టీల వారి అవసరం దృష్ట్యా మనం పదవులు కోల్పోతున్నామన్నారు. అందుకే ప్రజలు ఒకే పార్టీని గెలిపించడమే మంచి పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు లో కోట్ల రూపాయలను తన కుటుంబం నష్టపోయిందన్నారు. అందరు కలిసి రైతు సమస్యలపై పోరాడుతున్నప్పుడు జగన్ దీక్ష చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ రైతు పక్షపాతి అని, ఆయనకు అన్నీ తెలుసునన్నారు. కిరణ్ కొత్తగా వచ్చినందు కొంత సమయం తీసుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications