ఆహారం తీసుకోకపోతే చంద్రబాబు ఆరోగ్యం మరింత విషమిస్తుంది: రమేష్

ఇకపై దీక్ష కొనసాగించటం చంద్రబాబు ఆరోగ్యరీత్యా మంచిదికాదని నిమ్స్ డైరక్టర్ రమేష్ అన్నారు. బాబు శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గాయని చెప్పారు. ఆహారం తీసుకోవాలని చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులకు గట్టిగా చెప్పామన్నారు. ఆహారం తీసుకునేందుకు బాబు పూర్తిగా నిరాకరిస్తున్నారని అన్నారు. బాబుకు ప్రతి 6 గంటలకు ఓసారి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నిరాహారదీక్ష చేపట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై నాంపల్లి మున్సిఫ్ మెజిస్ట్రేట్‌కు పోలీసులు ఓ నివేదిక సమర్పించారు. ఆయన ఆరోగ్యం విషమిస్తున్నందున ఫ్లూయిడ్స్ తీసుకోవాలని బాబును ఆదేశించాలని కోర్టును కోరారు.












Click it and Unblock the Notifications