వైయస్ జగన్ లక్ష్య దీక్ష ప్రారంభం: భారీగా వచ్చిన అభిమానులు

YS Jagan
విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విజయవాడలోని కృష్ణా తీరంలో ఏర్పాటు చేసిన వైయస్సార్ ప్రాంగణంలో తన లక్ష్యదీక్షను ప్రారంభించారు. రైతు సమస్యలపై ఆయన 48 గంటల పాటు నిరాహారదీక్షను తలపెట్టిన విషయం తెలిసిందే. దీక్ష ప్రారంభానికి ముందు ఆయన విజయవాడ దుర్గగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ఆయన దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. తన తండ్రి వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన దీక్షను ప్రారంభించారు.

వైయస్ జగన్ సంబందిత వార్తలు

దీక్ష ప్రాంగణం వేదిక మీది నుంచి వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు ప్రసంగించారు. రైతులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారని, రైతులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వైయస్ జగన్ పెట్టిన డిమాండ్లను రైతు శ్రేయస్సు కోసం అంగీకరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లాకు చెందిన నాయకుడు మాకినేని పెదరత్తయ్య కూడా మాట్లాడారు. రైతుల పట్ల నిబద్ధత గల నాయకుడు వైయస్ జగన్ ఒక్కరేనని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. రాష్ట్రానికి వైయస్ జగన్ నాయకత్వమే శరణ్యమని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+