వైయస్ వివేకానంద రెడ్డిని ప్రశ్నించిన అంబటి, డిఎల్ పై నిప్పులు

రవీంద్రా రెడ్డి అవాకులు చెవాకులను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో డిఎల్ రవీంద్రా రెడ్డి లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ పై పోరాడుతానని చెప్పిన రవీంద్రా రెడ్డి మంత్రి వర్గంలో చేరి విలువలకు తిలోదకాలిచ్చారని ఆయన అన్నారు. అధికారం వచ్చేసరికి రవీంద్రా రెడ్డికి మదం పెరిగిందని ఆయన అన్నారు. కన్నుమిన్ను కానక రవీంద్రా రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రాయలసీమ పౌరషం ఉంటే శ్రీకాంత్ రెడ్డి చేసిన సవాల్ ను స్వీకరించి రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని ఆయన రవీంద్రా రెడ్డిని డిమాండ్ చేశారు.
ఎఐసిసికి సిగ్గు లేదని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ మరణానికి దిగ్భ్రాంతికి గురై మరణించినవారి కుటుంబాలకు లక్ష రూపాయలేసి నష్టపరిహారం ఇస్తామని ప్రకటించిన కాంగ్రెసు అధిష్టానం ఇప్పటి వరకు ఇవ్వలేకపోయిందని, ఎఐసిసికి సిగ్గు లేదని ఆయన అన్నారు. అన్ని జిల్లాల్లో యంత్రాంగం ఉన్న కాంగ్రెసు నష్టపరిహారం ఇవ్వలేకపోయిందా అని ఆయన అడిగారు. తమది రైతుల ప్రభుత్వమని ఈ ప్రభుత్వం నమ్మకం కలిగించలేకపోయిందని ఆయన అన్నారు. వైయస్ జగన్ కు పోటీగా చంద్రబాబు కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications