గుంటూరులో శంకర్ దాదా అవతారమెత్తిన పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి

శంకర్ దాదా చిత్రంలో వైద్యంతో కన్నా ప్రేమతోనే రోగాన్ని నయం చేయవచ్చని చెప్పిన చిరంజీవి తన నిజ జీవితంలో కూడా ఆ యువకుడిపై అదే ప్రయోగం చేశారు. పెరాలసిస్ తో బాధపడుతున్న యువకుడిని మాట్లాడించడానికి తెగ ప్రయత్నాలు చేశారు. యువకుడి పక్కనే కూర్చుని కళ్లు ఆర్పమని, శ్వాస పీల్చుకోమని చెప్పాడు. నా మాటలు నీకు అర్థం అవుతున్నాయా అంటూ ప్రశ్నించారు. నీకోసమే వచ్చానన్నాడు. ఆ యువకుడు కూడా చిరంజీవి చెప్పినట్లుగా చేశాడు. సినిమాలలో ప్రేమతో ఆరోగ్యాన్ని బాగు చేయవచ్చునని చెప్పిన చిరంజీవి నిజజీవితంలో కూడా దానిని చేయడం విశేషం.












Click it and Unblock the Notifications