చిదంరానికి తెలంగాణ పోటు: డైలమాలో అఖిల పక్ష సమావేశం

కాగా, ఈ నెల 6వ తేదీన శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం కూడా సందిగ్ధంలో పడింది. ఈ సమావేశానికి పార్టీకి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానిస్తూ చిదంబరం రాష్ట్రంలోని ఎనిమిది పార్టీలకు ఆహ్వానాలు పంపారు. అయితే, పార్టీకి ఒక్కరేసి ప్రతినిధినే ఆహ్వానించాలని, అప్పుడే తాము హారవుతామని, లేదంటే సమావేశాన్ని బహిష్కరిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రకటించడంతో అగ్గి రాజుకుంది. ఈ సమావేశానికి పార్టీకి ఒక్కరినే పిలవాలని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒక్కరినే ఆహ్వానిస్తే, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి సీమాంధ్రకు చెందిన నాయకుడు వెళ్తాడా, తెలంగాణ ప్రాంతానికి వెళ్తాడా అనే సందేహాన్ని పక్కన పెడితే కాంగ్రెసును ఇబ్బందుల్లో పెట్టే ఉద్దేశంతోనే వారు ఈ డిమాండ్ చేస్తున్నారనేది నిజం. ఏమైనప్పటికీ, ఈ సమావేశాన్ని అదే సాకుతో తెలుగుదేశం పార్టీ కూడా బహిష్కరించే అవకాశాలు లేకపోలేదు. మరో వైపు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు కమిటీ సభ్యులపై, నివేదిక సిఫార్సులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో 6వ తేదీ సమావేశం ఉండకపోవచ్చుననే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications