కాల్పుల్లో మద్దెలచెర్వు సూరి మృతి, ధ్రువీకరించని అపోలో వైద్యులు

కాగా, పరిటాల రవి అనుచరులే ఈ హత్యకు పాల్పడ్డారని సూరి మేనల్లుడు ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. ఏదో జరిగింది, త్వరలోనే వివరాలు తెలుస్తాయని ఆయన ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ఈ పనికి ఎవరు పాల్పడ్డారనే విషయం బయట పడుతుందని ఆయన అన్నారు. కాగా, నమ్మినవారే ఈ పనికి పాల్పడినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూరిపై దాడి నేపథ్యంలో అనంతపురం, హైదరాబాద్, విజయవాడల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఓ ఇంట్లో భోజనానికి వెళ్లి తిరిగి వస్తుండగా సూరిపై దాడి జరిగినట్లు చెబుతున్నారు. పరిటాల రవి హత్య కేసులో ఇప్పటి వరకు మిగిలి ఉన్న నిందితుడు సూరి ఒక్కడే.












Click it and Unblock the Notifications