అఖిలపక్షానికి టిడిపి డుమ్మా?: చంద్రబాబుపై తెలంగాణ ఫోరం ఒత్తిడి

Telugudesam
హైదరాబాద్: తెలంగాణ అంశంపై జనవరి 6వ తేదిన కేంద్ర హోంమంత్రి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించాలనే యోచనలో పడినట్లుగా తెలుస్తోంది. కేంద్రం ఒక్కో పార్టీనుండి ఇద్దరిని పిలవడం పట్ల ఫలితం ఏమీ ఉండదని, మరోసారి కేంద్రం తెలంగాణ అంశాన్ని తాత్సారం చేయాలనే అఖిలపక్షానికి ఇద్దరు చొప్పున పిలుస్తోందంటూ బిజెపి, టిఆర్ఎస్ ఇప్పటికే బహిష్కరించాయి. బహిష్కరించిన పార్టీలు మిగిలిన పార్టీలు కూడా అఖిలపక్షాన్ని బహిష్కరించాలని కోరుతున్నాయి.

దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ఫోరం నేతలు పునరాలోచనలో పడ్డారు. ఒక్కో పార్టీనుండి ఒక్కరిని పిలిస్తేనే ఫలితం ఉంటుందని, ఇద్దరిని పిలవటం సమంజసంగా లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అఖిలపక్షాన్ని బహిష్కరించాలని వారు తమ అధ్యక్షుడు చంద్రబాబును కోరుతున్నారు. ఈ విషయమై మంగళవారం తెలంగాణకు చెందిన పార్టీ నేతలు చంద్రబాబును కలవనున్నట్లు సమాచారం. ఇరు ప్రాంతాలనుండి ఒక్కోరు వెళితే ఫలితం తేలదని వారు బాబుకు చెప్పి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

పార్టీ అఖిలపక్షానికి హాజరు కాకుంటే సీమాంధ్రలో గానీ, తెలంగాణలోగానీ ఎలాంటి సమస్యలు ఉండవని తెలంగాణ నేతలు ఆయనకు చెప్పనున్నారు. హాజరైతే మాత్రం తెలంగాణ నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముందని సూచించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉస్మానియా విద్యార్థులు చంద్రబాబును కలిసి అఖిలపక్షాన్ని బహిష్కరించాలని కోరారు. అందుకు ఆయన పరిశీలిస్తానని వారికి హామీ ఇచ్చారు. మరోవైపు కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆ పార్టీ శాసనసభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. అఖిలపక్షానికి హాజరైన వారి ఇళ్లను ముట్టడిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా అఖిలపక్షానికి హాజరు కావద్దనే నిర్ణయానికి అంతిమంగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+