మూడు సిఫార్సులు ఆచరణ సాధ్యం కావని కమిటీయే చెప్పింది: చిదంబరం

కమిటీ నివేదికను చదవండి, అర్థం చేసుకోండి, మాట్లాడండి అని ఆయన కోరారు. కమిటీ నివేదికపై తక్షణమే ఓ నిర్ణయానికి రావద్దని ఆయన సూచించారు. పూర్తిగా చదివిన తర్వాత తుది నిర్ణయానికి రావాలని ఆయన కోరారు. ముందే ఒక అభిప్రాయానికి వచ్చి నివేదికను చదవవద్దని, ఓపెన్ మైండ్‌తో చదవాలని ఆయన అన్నారు. తమకు సహకరించాలని ఆయన ప్రజలను, రాజకీయ పార్టీలను మీడియాను కోరారు. అఖిల పక్ష సమావేశానికి కొన్ని పార్టీలు రాకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications