శ్రీకృష్ణ కమిటీ నివేదికపై స్పష్టత ఇంకా రాలేదు: జెసి దివాకర్ రెడ్డి

శ్రీకృష్ణ కమిటీ నివేదిక మాత్రమే సమర్పించిందని, నిర్ణయం చెప్పలేదని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, అందువల్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం అందరి అభిప్రాయాలు తీసుకుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తాను కట్టబడి ఉంటానని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజన విషయంలో తెలంగాణ నేతలు సంయమనం పాటించాలని మంత్రి టిజి వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. మూడు ప్రాంతాలకు మూడు రాజధానులను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయాలను గౌరవిస్తూ తమ పార్టీకి చెందినవారు తమ తమ అభిప్రాయాలను జత చేసి పార్టీ అధిష్టానానికి చెప్పాలని, కేంద్ర నిర్ణయం వెలువడే వరకు వేచి చూడాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications