కెసిఆర్ సేఫ్: కష్టాలు తెలంగాణ కాంగ్రెసు నాయకులకే

శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెలువడే వరకు ఆత్మరక్షణలో పడిన తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు కూడా కాస్తా సేఫ్‌గానే బయట పడ్డారు. ఇప్పుడు బాణాలన్నీ కాంగ్రెసుపై ఎక్కుపెట్టడానికి వారికి అవకాశం చిక్కింది. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామేనంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు ప్రకటిస్తూ వచ్చారు. దానికి విరుద్ధంగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఉంది. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో అడుగు పెట్టని పరిస్థితి ఉంది. దీంతో వారు ఏదో ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకునే పరిస్థితిలో పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు కట్టుబడి ఉండాలని తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు పట్టుబట్టడం తప్ప మరో మార్గం వారికి లేదు.












Click it and Unblock the Notifications