రాజీనామా చేయడమే కాదు, ఆమరణ దీక్షకూ దిగుతా: జూపల్లి కృష్ణారావు

తెలంగాణ కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల సమావేశానికి మంత్రులు కె. జానారెడ్డి, బసవరాజు సారయ్య, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే పదవులకు రాజీనామా చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బలగాలను, తెలంగాణలోని కేంద్ర బలగాలను ఉపసంహరించాలని వారు కోరారు.












Click it and Unblock the Notifications