సోనియా మెడ మీద కత్తి తెలంగాణ, మరోవైపు జగన్ త్రెట్

న్యూఢిల్లీ: తెలంగాణ అంశం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మెడపై కత్తిలా వేలాడుతోంది. సమస్యకు శ్రీకృష్ణ కమిటీ ఏ విధమైన పరిష్కారం చూపకపోగా, సమస్యను మరింత జఠిలం చేసింది. తెలంగాణపై వేసిన శ్రీకృష్ణ కమిటీ కాంగ్రెసు నాయకత్వానికి ఏడాది పాటు ఊపిరి తీసుకోవడానికి సమయం మాత్రమే ఇచ్చింది. అంతకు మించి అది సూచించిన పరిష్కార మార్గమేదీ లేదు.

పైగా, శ్రీకృష్ణ కమిటీ చేసిన సూచనలు మరింత గందరగోళానికి దారికి కారణమవుతున్నాయి. కమిటీ పేరు మీద ఏడాది పాటు సమయం తీసుకున్న కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై చేసిన కసరత్తు కూడా ఏమీ లేదని అర్థమవుతోంది. ఒకవేళ అలా కసరత్తు చేసి ఉంటే ఫలితం ఇంత దారుణంగా ఉండేది కాదని అంటున్నారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికను సీమాంధ్ర నాయకులు అందించిన వివరాలతోనే రూపొందించారనేంత తీవ్రమైన వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాసిచ్చిన స్క్రిప్టుగా శ్రీకృష్ణ కమిటీ నివేదికను బిజెపి నాయకుడు ఎన్. ఇంద్రసేనా రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు తాను చేపట్టిన విషయాలపై సమర్పించిన నివేదికలకు శ్రీకృష్ణ ఎంతగా మెప్పు పొందారో తెలంగాణపై నివేదికకు అంతగా విమర్శలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. టిజి వెంకటేష్ వంటి రాయలసీమ నాయకులు కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదికపై సంతృప్తి వ్యక్తం చేయడం లేదు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులపై ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. రాజీనామాలు చేయడమో, ఇళ్లకు పరిమితం కావడమో చేయాల్సిన స్థితికి నెలకొని ఉంది. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసనసభ్యుల ఇళ్లను కూడా తెలంగాణవాదులు ముట్టడిస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఏ విధమైన బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ హెచ్చరికలు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులపై పనిచేయడం లేదు. ఒక రకంగా సోనియా గాంధీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెలువడిన నేపథ్యంలో కాంగ్రెసు కోర్ కమిటీ శుక్రవారం సాయంత్రం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలో సమావేశమవుతోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై, తెలంగాణలో పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కడమనేది సోనియా తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది.

మరోవైపు వైయస్ జగన్ వ్యవహారం సోనియా గాంధీని ఇంకా వదలడం లేదు. శాసనసభ్యులు వైయస్ జగన్ వెంట వెళ్లకుండా నిరోధించడంలో ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా సఫలం కావడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద, రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి తీవ్రమైన గందరగోళంలో పడిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+