శోభానాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డిలపై చర్యలు: జగన్ వెంట వెళ్లడంపై చిరు

గవర్నర్‌తో జనవరి 1న భేటీ అవుదామనుకున్నానని, ఇద్దరికీ కుదరకపోవడంతో అప్పుడు మాట్లాడలేకపోయానని, సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికే ఇప్పుడు వచ్చానని, మా సమావేశానికి రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యం లేదని, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి రెండు మూడు నిమిషాలే చర్చ సాగిందని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడి నేపథ్యంలో అశాంతి చెలరేగుతుందని అందరూ భయపడ్డారని, కానీ అలాంటి పరిస్థితి లేదని, రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు నెలకొనడం శుభపరిణామమని చిరంజీవి వ్యాఖ్యానించారు. గవర్నర్‌తో ఇదే విషయమై సంతోషం వ్యక్తం చేశానన్నారు. కమిటీ సమైక్యాంధ్రకు అనుకూలంగా నివేదిక ఇవ్వడం శుభపరిణామమని, తమ పార్టీ చేసిన సూచనతోనే నివేదికలో ఆరో ప్రతిపాదన రూపొందించారని, ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకు అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలనడం మంచిదని దీన్ని మేం స్వాగతిస్తున్నామని చిరంజీవి అన్నారు.












Click it and Unblock the Notifications