హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ధనబలంతో పైచేయికి యత్నిస్తున్నారు: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్మోహన్‌ రెడ్డి తనకున్న ధనబలంతో రాజకీయాల్లో పైచేయి సాధించాలని అనుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం అన్నారు. చంద్రబాబు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారికి హితబోధ చేసారు. జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించారని ఆ అక్రమ సొమ్ముతో రాజకీయాలను శాసించాలని చూస్తున్నారని అన్నారు.

పార్టీ కార్యకర్తలంతా ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జగన్ దీక్షలు కూడా టిడిపికి పోటీగా ఉన్నాయన్నారు. ఆయన దీక్షలన్నీ టిడిపి పోటీ దీక్షలుగానే కనిపిస్తున్నాయని ఆరోపించారు. దీనిని సైతం ప్రజల ముందుకు తీసుకు వెళ్లాలని ఆయన వారికి సూచించారు. పార్టీకి రాష్ట్రంలో ఎలాంటి సమస్య లేదని చెప్పారు. జగన్ టిడిపిని లక్ష్యంగా చేసుకున్నాడని చెప్పారు. గతంలో రైతుల సమస్యలపై నిరాహార దీక్షకు దిగినప్పుడు జగన్ విజయవాడలో లక్ష్యదీక్షను చేపట్టడం, ఇటీవల గుంటూరు, కృష్ణా, ఖమ్మం జిల్లా రైతులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు ఆయన ఢిల్లీలో జలదీక్షను చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

తాజాగా టిడిపి పెట్రో ధరలపై 22న రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునివ్వడంతో విజయవాడలో పెట్రో మంటలపై ఆయన సైతం దీక్షను టిడిపి ప్రకటించిన తర్వాత ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇవన్నీ చూస్తుంటే జగన్ టిడిపిని లక్ష్యంగా చేసుకున్నట్టు ఉన్నదని ఆ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వారికి సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X