చిరంజీవికి వైయస్ జగన్ భయం, అందుకే ఎమ్మెల్యేల భేటీ?

సమావేశానంతరం తన పార్టీ శాసనసభ్యులతో పాటు చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుస్తారు. తమ తమ నియోజకవర్గాల్లో పనులు కావడం లేదని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ తీసుకునేందుకున చిరంజీవి తన శాసనసభ్యులను తీసుకుని వెళ్తున్నట్లు సమాచారం. దాని వల్ల వైయస్ జగన్ వైపు వారు చూడకుండా జాగ్రత్త పడాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. కాగా, మంగళవారం ఢిల్లీలో ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీల మధ్య సంబంధాలపై ఆయన ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications