ఫిబ్రవరి రెండో వారంలో వైయస్ జగన్ పార్టీ, మూడు తేదీలు పరిశీలన

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తన కొత్త పార్టీని ఫిబ్రవరి రెండో వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 12, 16, 18 తేదీల్లో ఏదో ఒక తేదీన ఆయన తన పార్టీని ప్రకటిస్తారని చెబుతున్నారు. తన సన్నిహితులతో చర్చించిన తర్వాత జగన్ పార్టీ ప్రకటనకు తేదీని ఖరారు చేస్తారు. కడప జిల్లా పులివెందులలో గల దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించి తన పార్టీని జగన్ ప్రకటిస్తారు.

వైయస్ జగన్ ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు ఈ ఓదార్పు యాత్ర జరుగుతుంది. ఆ తర్వాత 22వ తే్దీన విశాఖపట్నంలో ఆయన ఒక్క రోజు జనదీక్ష చేపడతారు. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా, నిత్యావసర ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వాల వైఫల్యానికి వ్యతిరేకంగా ఆయన ఈ జనదీక్ష చేపడుతున్నారు. ఆ తర్వాత పార్టీ ఏర్పాటుపై కసరత్తు ప్రారంభిస్తారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+