సమైక్యాంధ్రపై నిలదీసిన వ్యక్తిపై చేయి చేసుకున్న ఎంపీ లగడపాటి

Lagadapati Rajagopal
విజయవాడ: పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు రచ్చబండలో తీవ్ర పరాభవం ఎదురయ్యింది. కృష్ణా జిల్లాలోని తిరువూరు మండలం చిట్టెల గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హాజరయ్యారు. ఆ సమావేశంలో అశోక్ అనే స్థానికుడు లగడపాటిని నిలదీశాడు. మీరు సమైక్యాంధ్ర నినాదం ఎందుకు ఎత్తుకున్నారని, కేవలం మీ ఆస్తులు కాపాడుకోవడానికేనా అంటూ నిలదీశారు. దీంతో లగడపాటి ఆయన అనుచరులు తీవ్రస్థాయిలో ఊగిపోయారు.

తనను నిలదీసిన వ్యక్తిపై లగడపాటి ఆయన కాలర్ పట్టుకుని పక్కకు గెంటివేశారు. ఆయన అనుచరులు ఆయనపై చేయి చేసుకున్నారు. అనంతరం అశోక్‌ను అక్కడినుండి గెంటివేశారు. కాగా ఆయన వ్యాఖ్యలతో విభేదించిన లగడపాటి రాష్ట్రం విడిపోయినా కలిసి ఉన్నా వ్యాపారాలు ఉంటాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+