రచ్చబండలో పాల్గొంటున్న వైయస్ జగన్ క్యాంప్ శాసనసభ్యులు

Congress
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో పలు చోట్ల మాజీ పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు పాల్గొంటున్నారు. వైయస్ జగన్‌కు చెందిన కడప జిల్లా శాసనసభ్యులు కూడా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. కడప జిల్లాలో వైయస్ జగన్ వర్గానికి చెందిన నలుగురు శాసనభ్యులు సోమవారం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కమలమ్మ, శ్రీనివాసులు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను రేపటి నుంచి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటానని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి చెప్పారు.

తాము జగన్ వెంట నడుస్తున్నా అధికార కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులమేనని, అందువల్ల రచ్చబండలో పాల్గొనాల్సిన బాధ్యత తమపై ఉందని వారు చెబుతున్నారు. కాగా, జగన్ వెంట నడుస్తున్నారని భావిస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన శాసనసభ్యులు పేర్ని నాని, జోగి రమేష్, మల్లాది విష్ణు కూడా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా జగన్‌కు మద్దతు తెలిపిన శ్రీకాకుళం జిల్లా టెక్కలి శాసనసభ్యురాలు కొర్ల భారతి కూడా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో జగన్‌కు మద్దతిస్తున్న కాంగ్రెసు కాంగ్రెసు శాసనసభ్యురాలు నీరజా రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ప్రజారాజ్యం శాసనసభ్యుడు కాటసాని రాంరెడ్డి రచ్చబండ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సికె బాబు రచ్చబండకు గైర్హాజరయ్యారు.

ఇదిలా వుంటే, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నారు. తెలంగాణలోనే కాకుండా సీమాంధ్రలో కూడా వారు రచ్చబండ కార్యక్రమానికి హాజరు కావడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+