అలీబాబా 40 దొంగలకు వైయస్ జగన్ బాస్: డిఎల్ రవీంద్రారెడ్డి

DL Ravindra Reddy
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ను అలీబాబా 40 దొంగలకు బాస్‌గా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అభివర్ణించారు. జగన్ చుట్టూ సైకో ఫ్యాన్స్ ఉన్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వంద జగన్‌లు వచ్చినా మైదుకూరులో తనను ఓడించలేరని ఆయన దీమా వ్యక్తం చేశారు. పులివెందుల, కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెసు గెలుస్తుందని ఆయన అన్నారు. ఇందిరమ్మ రాజ్యం కావాలో, దోపిడీదారుల రాజ్యం కావాలో ప్రజలు తేల్చుకుంటారని ఆయన అన్నారు. జగన్ అక్రమాస్తుల చిట్టా తన వద్ద లేదని, పత్రికల్లో వచ్చిన వార్తాకథనాలను విశ్లేషిస్తే కొన్ని నిజాలు బయటపడ్డాయని ఆయన చెప్పారు.

జగన్‌ను లక్ష్యం చేసుకోవడానికి రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వైయస్సార్ మృతితో కార్యక్రమం ఆగిపోయిందని, దాన్ని తాము ఇప్పుడు పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో చేపట్టామని ఆయన అన్నారు. వైయస్సార్ ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని తాము కూల్చబోమని అంటూనే విశ్వాస పరీక్షకు సిద్ధం కావాలని జగన్ వర్గం అంటోందని, పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తోందని ఆయన అన్నారు. జగన్‌ను ఆత్మరక్షణలో పెట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తమకు బ్లాక్ మెయిల్ చేసే అలవాటు లేదని, వైయస్ జగన్‌కూ సాక్షి మీడియాకూ ఆ అలవాటు ఉందని, అన్ని విషయాలూ బయటపడే సమయం వచ్చిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+