తెలంగాణకు సంకీర్ణమే అడ్డు: డిఎంకే, ఎన్సీపీ, తృణమూల్ వ్యతిరేకం?

కేంద్రంలో యూపిఏ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నందువల్లనే తెలంగాణ ఉద్యమం ఇంత భారీ ఎత్తున జరుగుతున్నప్పటికీ కేంద్రం నాన్చుతున్నట్టుగా భావిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే దేశంలో మరిన్ని ప్రత్యేక వాదాలు బయటకు వస్తాయని యూపిఏ భాగస్వామ్యంలోని పలు పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నుండి బుందేల్‌ఖండ్, మహారాష్ట్ర నుండి విదర్భ, తమిళనాడునుండి కూడా ఇప్పటికే వస్తున్న ప్రత్యేక వాదనలకు మరింత బలం చేకూరుతుందని ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది.
యూపిఏ ప్రభుత్వంలో ఉన్న డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ప్రకటించిన నేపథ్యంలో తాము యూపిఏ నుండి విరమించుకునేందుకు కూడా వారు సిద్దంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ బెట్టుకు పోయి తెలంగాణ ప్రకటిస్తే తమిళనాడునుండి కరుణానిధి, మహారాష్ట్రనుండి శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ నుండి మమతా బెనర్జీ తదితరులు యూపీఏకు మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని జాప్యం చేయడానికి చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications