కాకాకు పిచ్చి ముదిరింది: వెంకటస్వామిపై విరుచుకు పడినకాంగ్రెసు

పదవులు ఆశించకుండా దేశానికి సేవ చేస్తున్న త్యాగశీలి సోనియా అని మంత్రి శ్రీధర్‌బాబు కరీంనగర్‌లో అన్నారు. పార్టీ పటిష్టానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ తెలంగాపై మంచి నిర్ణయం తీసుకుంటారనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టానికి కొన్ని వ్యూహాలు అనుసరించాల్సిన అవసరం ఉంటుందన్నారు. పార్టీని పటిష్టం చేయడానికి తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేదన్నారు.
కాకాకు పిచ్చి ముదిరిందని మరో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మతి భ్రమించే సోనియాపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రజారాజ్యంతో పొత్తు తెలంగాణ ఇవ్వడానికే అని ఎందుకు అనుకోకూడదని ఆయన ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం అయితే ఒకరకంగా, పొత్తు కుదిరితే ఓ రకంగా పదవి వస్తుందన్నారు. కాకా వ్యాఖ్యలపై కాంగ్రెసు నేతలకు ఎవరికీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిన అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications