హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఫీజుపోరు ప్రారంభం: భారీగా తరలిన విద్యార్థులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ విడుదల చేయాలంటూ మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం అయింది. జగన్ తన హైదరాబాద్‌లోని తన ఇంటినుండి బయలుదేరి పంజాగుట్టలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అక్కడినుండి నేరుగా ట్యాంకుబండ్‌ వద్దకు వెళ్లి అక్కడి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అంబేడ్కర్ విగ్రహం నుండి ఇందిరాపార్కుకు వెళ్లి అక్కడ దీక్షకు కూర్చున్నారు.

జగన్ దీక్షకు మద్దతుగా భారీగా విద్యార్థులు తరలి వచ్చారు. తమ ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై ఎవరు పోరు చేసినా వారికి మద్దతు తెలుపుతామని విద్యార్థులు చెబుతున్నారు. జగనే కాదని, మాకోసం ఉద్యమిస్తున్న అందరికీ మద్దతు తెలుపుతామని స్పష్టం చేశారు.

English summary
Ex MP YS Jaganmohan Reddy started his Fee Poru at Indira Park today. He started from his residence around ten O clock. Many of students are supporting Jagan's agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X